ఓటమికి పూర్తి భాద్యత నాదే..:హరీష్ రావు

దుబ్బాక ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి భాద్యత వహిస్తానని,ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన వారందరికి,పార్టీ కోసం పనిచేసిననాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గెలుపు-ఓటములు సహజం అని ఎవ్వరు అధైర్య పడొద్దని హరీష్ రావు తెలిపారు.