గవర్నర్ కి తప్పిన ప్రమాదం

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఘోర రోడ్డు ప్రమాదం నుండి బయట పడ్డారు.చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సూర్యాపేటలో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెల్తున్న తరుణంలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్ళింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు.గవర్నర్ వేరే వాహనంలో సూర్యాపేటకు వెళ్ళిపోయారు.