ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ నూతన మేయర్‌ ఎన్నిక

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిని నియమించనున్నారు.ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశంలో మేయర్ ఎన్నిక ఉంటుంది. తర్వాత డిప్యూటీ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఎన్నిక ప్రక్రియ పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సీనియర్ ఐఏఎస్‌ అధికారిని పరిశీలకునిగా నియమిస్తుంది. ఏదైనా కారణాల వల్ల 11.02.2021న ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు 12.02.2021 (ఒకవేళ సెలవు రోజు అయినప్పటికీ)న ఈ ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించింది.