గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన వారి పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. 2020 జీహెచ్ఎంసీ సాధారణ ఎన్నికల్లో 150 డివిజన్ల నుంచి గెలుపొందిన వారి పేర్లను గెజిట్​లో పొందుపర్చారు. ఇవాళ్టి తేదీతో గెజిట్​ను ప్రచురించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి నోటిఫికేషన్ జారీ చేశారు.

150 డివిజన్ల నుంచి ఎన్నికైన అభ్యర్థులు, పార్టీ, రిజర్వేషన్ల వివరాలను అందులో పేర్కొన్నారు. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే నెల 11 వరకు ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కొత్త పాలకమండలి మొదటి సమావేశ తేదీని ప్రకటిస్తూ విడిగా మరో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది.

G 695