మందుబాబులకి షాక్

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:హైదరాబాద్ లోని మందుబాబులకి తెలంగాణ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ 1 న జరుగుతున్న తరుణంలో నవంబర్ 29 సాయంత్రం 6 గంటల నుండి డిసెంబర్ 1 పోలింగ్ ముగిసే వరకు వైన్స్ బంద్ చేయాలని ఎన్నికల సంఘం కమీషనర్ పార్థసారథి అధికారులని ఆదేశించారు.అక్రమ మద్యం రవాణాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.