గ్రేటర్ పోరుకి సర్వం సిద్ధం?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సమావేశమయ్యారు. మీటింగ్ లో పాల్గొన్న అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తుంది,రేపు ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.దీపావళి తరువాత ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.నోటిఫికేషన్ తరువాత 15రోజుల్లోగా ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నది.ఎన్నికలు డిసెంబర్ లో జరిగితే 6(బ్లాక్ డే) వ తేదీ లోపే ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్టు తెలుస్తుంది.ఎన్నికల సంఘం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.