ఆగివున్న నీళ్ళ ట్యాంకర్ ని ఢీకొన్న కారు… నలుగురు మృతి

యాదాద్రి,తీస్మార్ న్యూస్:భువనగిరి జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం సంభవించింది.హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై కలెక్టర్ కార్యాలయం ఎదుట మొక్కలు నీళ్లు పోయాడానికి ఆగి ఉన్న నీళ్ల ట్యాంకర్ ను కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.మృతులు మల్కాజ్ గిరి,ఈసీఐఎల్ కి చెందిన వెంకటేష్,హర్షవర్థన్,అఖిల్,కళ్యాణ్ గా గుర్తించారు.తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.