ఉద్యమ సారథిని బిడ్డ పెండ్లికి ఆహ్వనించిన తెలంగాణ వాది

తెలంగాణ ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్ని వినిపించిన రైతు శ్రీ ఫణికర మల్లయ్య, తన కుమార్తె పెండ్లి కార్డును సీఎం శ్రీ కేసీఆర్ కు అందించి ఆహ్వానించారు. తాను కోరుకున్న రైతు తెలంగాణను నడిపిస్తున్నరనే సంతోషంతో, నాటి ఉద్యమ సారధి నేటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ను తన బిడ్డ పెండ్లికి ఆహ్వానించడానికి వచ్చినట్టుగా శ్రీ ఫణికర మల్లయ్య తెలిపారు.