ప్రాణం తీసిన చేపల వేట

రాజన్న సిరిసిల్ల,తీస్మార్ న్యూస్: జిల్లాలోని ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ అనుబంధ గ్రామమైన తెనుగువారిపల్లి బోయిన దేవయ్య(40) చేపలకు వల వేస్తున్న క్రమంలో కాళ్లకు చుట్టుకొని నీట మునిగి మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య లలిత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దేవయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.