ఫతేనగర్ కార్పొరేటర్ పాదయాత్ర

ఫతేనగర్ డివిజన్ పరిధిలోని నేతాజీ కాలనీ మరియు అల్విన్ సొసైటీలో గతంలో ప్రజా సమస్యల పై కార్పొరేటర్ గారి పాదయాత్ర సందర్భంగా కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మా గల్లీలలో వర్షపు నీళ్లు ఆగి రోడ్డు పాడైతుంది అని కార్పొరేటర్ గారి దృష్టికి రావడంతో ఈ రోజు కాంట్రాక్టర్ మరియు ae pavan తో కలిసి పర్యటించిన అనంతరం కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ గారు మాట్లాడుతూ కూకట్ పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి సహకారంతో నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.