క్రికెట్ దిగ్గజం పొలార్డ్ మృతి?

హైదరాబాద్ : వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ చనిపోయడంటూ సోసల్ మీడియాలో నిన్న రాత్రి నుండి వీడియోలు వైరల్ అవుతున్నాయి. పొలార్డ్ కారు ప్రమాదంలో మృతి చెందాడు అంటూ యూట్యూబ్ ఇతర సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలను వైరల్ చేశారు నెటిజన్లు వాట్సాప్ స్టేటస్సులో ఈ వీడియోలు దర్శనమిచ్చాయి. దీంతో నింజాగానే పొలార్డ్ చనిపోయడంటూ చాల వరకు పోస్టులు పెట్టెసారు. అయితే పొలార్డ్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం పొలార్డ్ అబుదాబిలో టి10లీగ్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ విషయం తెలియని చాలా మంది పాత వీడియో పోస్టు చేస్తు RIP అని పోస్టులు పెడుతున్నారు. దింతో పొలార్డ్ అభిమానులు నిజం తెలుసుకుని ఆ పోస్టులు పెట్టిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు పొలార్డ్ బతికె ఉన్నాడు అని పోస్టులు పెడుతున్నారు.