డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌: నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు మరింత కఠినతరం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వారంరోజుల్లో 3571 మందిపై కేసులు నమోదుచేశామని తెలిపారు. వాహనాలు స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నామని చెప్పారు. ఇందులో ఎక్కువగా ద్విచక్రవాహనదారులే ఉన్నారని వెల్లడించారు. ఆదివారం నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 346 మంది పట్టుబడ్డారని పోలీసులు చెప్పారు.