సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మంచి నీటి ఎద్దడిని పూర్తిగా నివారించ గలిగామని, త్వరలోనే శాంతీ నగర్ కొత్త రిజర్వాయర్ ను కూడా ప్రారంభించ నున్నామని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. మెట్టుగూడ డివిజన్ లోని లంబాడీ బస్తి లో రూ.15.60 లక్షల ఖర్చుతో నిర్మించనున్న మంచినీటి పైప్ లైన్ ల నిర్మాణం పనులను శ్రీ పద్మారావు గౌడ్ బుధవారం ప్రారంభించారు. లంబాడీ బస్తి తో పాటు వైట్ హౌస్, విజయ పురి ప్రాంతాల్లో మంచీ నీటి సరఫరా మెరుగుదలకు ఈ కొత్త పైప్ లైన్లు ఉప కరిస్తాయి. ఈ కార్యక్రమంలో జలమండలి GM రమణ రెడ్డి, యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్, అధికారులు, నేతలు, పాల్గొన్నారు.
బస్తీ వాసులతో ముఖాముఖీ
ఈ సందర్భంగా శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ లంబాడి బస్తి వాసులతో ముఖముఖిని నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులతో కలిసి బస్తీ ని సందర్శిస్తానని తెలిపారు. అదే విధంగా స్థానికులకు వరద సాయం అందించేందుకు ఏర్పాట్లు జరపాలని అధికారులను ఆదేశించారు.
