స్పిన్ బౌల్డ్…
  • లింక్ లు తెరిచి మోసపోవద్దు
  • హెచ్చరిస్తున్న సైబర్ క్రైం

హైదరాబాద్‌ నగరం,తీస్మార్ న్యూస్: “చక్రం తిప్పండి బహుమతులు గెలుచుకోండి” అని వచ్చే లింక్ లని క్లిక్ చేతే మీరు మోసపోడానికి సిద్ధమైనట్టే ఆ చక్రాన్ని తిప్పితే వైరస్ మీ ఫోన్ లోకి ప్రవేశించి మీ కాతాలు లూటి అవుతాయి. మీకు వచ్చిన లింక్ క్లిక్ చేసి స్పిన్ చేయగానే అందులో మీ సమాచారం మొత్తం నింపాలి తరువాత ఒక 20 గ్రూపులకి పంపమని వస్తుంది అలా చేస్తే మీరు బహుమతిని పొందగలరు అని మోసాలకు పాల్పడుతున్నారు.ఇలా మోసపోయిన పలువురు ఇటీవల సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు దృష్టిపెట్టారు. వాట్సాప్‌, సోషల్‌మీడియాలో ఇటీవల కొన్ని లింక్‌లు తిరుగుతున్నాయి. వాటిని క్లిక్‌ చేయగానే ఓ రంగుల చక్రం (స్పిన్నింగ్‌ వీల్‌) ప్రత్యక్షమవుతుంది. దానిని తిప్పగానే మీకు వెంటనే ‘యు వోన్‌ ఏ మొబైల్‌ లేదా ఓ బహుమతి గెల్చుకున్నారు’ అనే పాప్‌అప్‌ విండో వస్తుంది. ఇలా సైబర్‌ మాయగాళ్లు కొన్ని లింక్‌లను పంపిస్తారు. దానిని క్లిక్‌ చేయగానే వైరస్‌ మన స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌లోకి ప్రవేశిస్తుంది. ఇది బ్యాంకింగ్‌ వ్యవహారాలను సైబర్‌ దొంగలకు అందిస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల వచ్చిన కొన్ని ఫిర్యాదులను పరిశీలించినప్పుడు పోలీసులకు ఈ స్పిన్నింగ్‌ విన్‌ వీల్‌ గేమ్‌ గురించి తెలిసింది. ‘మీ క్రెడిట్‌కార్డులపై 50 రూపాయలు డిస్కౌంట్‌, మీకు 55 రూపాయల ఉచిత రీచార్జీ లభిస్తుంది, మీ గ్యాస్‌ సిలిండర్‌పై 55 రూపాయలు తగ్గింపు పొందండి, మీరు రూ.వెయ్యి విన్‌ అయ్యారు’ అని స్పిన్‌వీల్‌ చుట్టూ ఆకర్షణీయంగా రాసి పెట్టి సైబర్‌ మో సగాళ్లు నయా మోసానికి తెరలేపారు. గుర్తు తెలియని లింక్‌లను నమ్మి బోల్తా పడొద్దని, వాటిని తెరువొద్దని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం డీసీపీ రోహిణీ ప్రియదర్శిని సూచించారు.