రాష్ట్రానికి  చేరుకున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌

దేశవ్యాప్తంగా ఈనెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు.  మంగళవారం గన్నవరంలోని  టీకా నిల్వ కేంద్రానికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ చేరింది.  ఎయిర్‌పోర్ట్‌ కార్గో  నుంచి ప్రత్యేక వాహనాల్లో నిల్వ కేంద్రానికి తరలించారు.    పుణె నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు  4,96,680 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను తీసుకొచ్చారు.  సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్ఠ భద్రత మధ్య వ్యాక్సిన్‌ నిల్వ చేస్తున్నారు.  రేపు అన్ని జిల్లాలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ను అధికారులు తరలించనున్నారు.