హైదరాబాద్,తీస్మార్ న్యూస్:తాగిన మత్తులో పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించిన యువౌడిని అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు పోలీసులు.ఆ యువకుడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ కుమారుడు ఫయాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఫయాజ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పీకల దాకా మద్యం సేవించిన ఫయాజ్ ఆదివారం రాత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా హెడ్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.