దీనస్థితిలో ఉన్న కుటుంబాన్ని చూసి చలించిన సీఎం సతీమణి శోభమ్మ…

*కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్* *గ్రామానికి చెందిన కమటం తిరుపతి అనారోగ్యంతో చనిపోయారు.*

*అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పని చేసి కుటుంబ పోషణ సాగిస్తున్నారు. అతని భార్యకు మూడు ఆపరేషన్లు చేశారు.*
*తల్లిదండ్రులు పని చేయలేని పరిస్థితి. ఉన్న ఇల్లు మొన్నటి వర్షాలకు కూలడంతో నూతన గృహ నిర్మాణం మొదలు పెట్టారు. ఇంతలో తిరుపతి అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబ వీధి పాలైంది. ఉండటానికి ఇల్లు లేక గ్రామంలో మున్నూరు కాపు కులసంఘ భవనంలో నివాసం ఉంటున్నారు.*
*వారి దీన స్థితి గురించి మీడియాలో రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ చూసి చలించిపోయారు. తన వంతు సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.*
*చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఫోన్ చేసి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం* *అందజేయాలని సూచించారు.*
*ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ సూచనతో ఈ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె పంపిన లక్ష రూపాయలు,మిగిలిన దాతలు అందించిన రూ.2 లక్షలతో కలిపి మొత్తం మూడు లక్షలు ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందించారు.*
*అలాగే డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో చదివిస్తామని హామీ ఇచ్చారు. వారి పిల్లలకు చదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.*

*గతంలో ప్రత్యూషను దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్*
*పినతల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర వేధింపులకు గురైన ఓ అభాగ్యురాలు ప్రత్యూషను సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అత్యంత దారుణంగా వారు బాలికను హింసించిన ఘటన మీడియా ద్వారా తెలుసుకున్న సీఎం ఆమెను దత్తత తీసుకున్నారు. ఓ అధికారికి ఆమె యోగక్షేమాలు చూసుకోవాలని సూచించారు. తర్వాత ప్రత్యూష చదువుకుని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఇటీవల హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో నిరాడంబరంగా రాంనగర్‌ ప్రాంతానికి చెందిన చరణ్‌రెడ్డితో ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది. మమత, మర్‌రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో ప్రత్యూషను కలిసి విషయం చెప్పాడు. దీంతో ఆమెకూడా అందుకు అంగీకరించింది. ఈ సమాచారాన్ని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఉన్నతాధికారులకు చేరవేశారు. అధికారులు అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకున్న జరిపిన తర్వాత ఆమె నిశ్చితార్థం జరిగింది.*