రైతు బంధు(వు)

హైదరాబాద్, తీస్మార్ న్యూస్:ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల (జనవరి) 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని చెప్పారు.

యాసంగి సీజన్ రైతుబంధు సహాయం (రెండో విడత) పంపిణీకి సంబంధించి అధికారులతో సీఎం ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ఎస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు.

Chief Minister Sri K. Chandrashekar Rao has announced that financial assistance under Rythu Bandhu will be given from Dec 27 to January 7. The CM has instructed the officials concerned to ensure that each and every farmer in the state should get assistance under the Rythu Bandhu Scheme. The CM instructed the officials to deposit the amount directly into the accounts of farmers. He also instructed the officials from the Finance Department to release the required Rs 7,300 Crore. He said the assistance should begin with farmers who have less holding of lands and with the farmers having a large extent of holding and all farmers should get the assistance in ten days.

The CM held a review meeting on Monday at Pragathi Bhavan on Rythu Bandhu’s second phase of assistance distribution for the Yasangi season. Agriculture Minister Sri S Niranjan Reddy, Chief Secretary Sri Somesh Kumar, Principal Secretary (Finance) Sri Ramakrishna Rao, Principal Secretary (Agriculture) Sri Janardhan Reddy, and others participated. The review meeting discussed strategy on Rythu Bandhu distribution and finalised the action plan accordingly.