భూపాలపల్లి,తీస్మార్ న్యూస్:భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం కాళేశ్వరం పర్యటన లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మంగళవారం కుటుంబ సమేతంగా ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం ప్రాణహిత, గోదావరి సంగమ స్థలి పుష్కర ఘాట్ వద్ద నదీమ తల్లికి పసుపు కుంకుమ, పూలతో పాటు నాణాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.అంతకు ముందు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గంగుల కమలాకర్ గారు, జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత గారు, భూపాలపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ జక్కు శ్రీ షర్షిని-రాకేష్, శాసన సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ దంపతులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకొని అనంతరం ప్రాణహిత, గోదావరి సంగమ స్థలి పుష్కర ఘాట్ వద్ద నదీమ తల్లికి పసుపు కుంకుమ, పూలతోపాటు నాణాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
