డిసెంబర్ లో బల్ధియా పోరు… కేసీఆర్

డిసెంబర్ లో గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.దీపావళి తరువాత నోటిఫికేషన్ వెలువడచ్చని పేర్కొన్నారు.నోటిఫికేషన్ వెలువడిన రెండు వారాలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని, ప్రజలు టీ.ఆర్.ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారని,గతంలో కంటే ఎక్కువ చోట్లల్లో విజయం సాధిస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని..ఏ మాత్రం ఏమరపాటుగా ఉండోద్దని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్తు తెలుస్తుంది. బీజేపీ ని పట్టించుకోకుండా ముందుకు సాగాలని “మన సంక్షేమ పథకాలే మన బలం” అని ఆయన అన్నారు. గ్రేటర్ ఎన్నికలకు ఇంచార్జీగా పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ని నియమిస్తున్నట్టు తెలిపారు.