సీఎంకి కరోనా పాజిటివ్…పరిస్థితి విషమం

హైదరాబాద్,తీస్మార్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా భారీన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.తీవ్రమైన జ్వరం,ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో భాదపడుతున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ని డూస్ ఆసుపత్రికి తరలించారు.ఆయన పరిస్థితి విషమించడంతో డూస్ ఆసుపత్రి నుండి ఎయిమ్స్ కి తరలించినట్టు తెలుస్తుంది.ముఖ్యమంత్రికి,ఆయన కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు ఉన్నట్టు డిసెంబర్ 18న ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు.బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం,మాస్క్ తప్పనిసరి అని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది అక్కడి ప్రభుత్వం.