జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

బెజవాడ,తీస్మార్ న్యూస్:ప్రకాశం బ్యారేజీ వద్ద ఉపాధ్యాయులపై దౌర్యన్యం చేయడాన్ని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం. వెబ్ కౌన్సిలింగ్ పేరుతో వైకాపా నాయకులు జోక్యం చేసుకుంటూ ఉపాధ్యాయులను వేధించడం ఆపాలని చంద్రబాబు అన్నారు.విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ నాలుగు గోడల మధ్య ఉండే ఉపాధ్యాయులను దేశంలో ఎక్కడలేని విధంగా మద్యం షాపులలో పెట్టి వారి చేత మద్యం అమ్మించారు. పబ్లిసిటీ పిచ్చితో పాఠశాలలు తెరిచి వేలాది మంది విద్యార్దులు, వందలాది మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడేలా చేశారని ధ్వజమెత్తారు. వారం రోజులలో సిపిఎస్ రద్దు, 11వ పీఆర్సీ, బకాయిలు లేకుండా సమయానికి డిఎల చెల్లింపులపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పి అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలి. టీచర్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.