హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి ఆయనపై 504, 506, 427 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అరవింద్‌తో పాటు కార్యకర్తలపైనా కేసు నమోదు అయింది.
