దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడించిన విషయం విధితమే. అక్కడ పార్టీ ఓటమికి తమ నాయకుడే కారణం అని ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్తం కుమార్ రెడ్డి దిష్టి బొమ్మని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కాజీపేట, వరంగల్ కార్యకర్తలు దిష్టి బొమ్మను దహనం చేసిన అనంతరం మాట్లాడుతూ ఈ ఓటమికి పూర్తి బాధ్యత ఉత్తం వహించాలని దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కనీసం పోటీ ఇవ్వలేకపోయారని వారు వాపోయారు.పార్టీ ఓటమికి ఉత్తం తో పాటు మిగిలిన నాయకులు నైతిక బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.
