హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో భేటీ జరగనుంది. సమావేశంలో పాల్గొనే నిమిత్తం మంత్రులు, అధికారులు ప్రగతిభవన్‌కు చేరుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికలు, సన్న ధాన్యానికి మద్దతు ధర, రెవెన్యూ, పురపాలక సంబంధిత చట్టసవరణలు, బడ్జెట్ మధ్యంతర సమీక్ష, నీటిపారుదలశాఖ పునర్‌వ్యవస్థీకరణ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.
