ప్రముఖ నటి క్రితి సనన్ కి కరోనా పాజిటివ్

ముంబాయి,తీస్మార్ న్యూస్: బాలీవుడ్ నటి క్రితి సనన్ కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది.బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాలతో పాటు ఆమె వైద్యుడి సలహా ప్రకారం ఆమె స్వీయ నిర్భంధంలోకి వెళ్ళినట్టు నటి తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దని నటి తెలిపారు.ఆమె తెలుగులో దోచేయ్,1-నేనొక్కడినే సినిమాల్లో నటించారు.