పోలీసుల అదుపులో బీజేపీ  ఎమ్మెల్యే

హైదరాబాద్‌ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవులను వధించకుండా కాపాడేందుకు అదేవిధంగా రవాణా చేయకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తు ఎమ్మెల్యే రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. గోరక్షకులు, తన మద్దతుదారులతో ఎమ్మెల్యే రోడ్డుపై నిరసన తెలపడంతో ట్రాఫిక్‌ అసౌకర్యానికి కారణమయ్యారు. దీంతో ఎల్బీనగర్‌ పోలీసులు అదనపు సిబ్బందితో కలిసివెళ్లి రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.