రైతులకు మద్దతుగా తమ అవార్డులను వెనక్కి ఇచ్చేవారు నిజమైన దేశ భక్తులు కాదని మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి, బీజేపీ నేత కమల్ పటేల్ విమర్శించారు. వారికి అవార్డులు ఎలా వచ్చాయో తెలుసా అని ప్రశ్నించారు. భారత మాతపై నిందలు వేసేవారికి, దేశాన్ని ముక్కలు చేయాలన్న వారికి గతంలో అవార్డులు వచ్చాయని ఆరోపించారు. అలాంటి అవార్డు గ్రహితలు, మేధావులు ప్రస్తుతం వాటిని వెనక్కి ఇస్తున్నారని, వారు నిజమైన దేశ భక్తులు కాదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా కొందరు ప్రముఖులు తమ అవార్డును వెనక్కి ఇవ్వడంపై మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి, బీజేపీ నేత కమల్ పటేల్ ఈ మేరకు సోమవారం స్పందించారు.
Source from:ntnews.com