బిగ్ బాస్ ఈ పేరు తెలియని వారుండరు బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 పలు ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,మళయాలం,హిందీ తో పాటు తమిళంలో కూడా మంచి పేరుంది ఈ షోని తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. తొలి సీజన్‌లో ఆరవ్ నఫీజ్ విన్నర్ కాగా, ఆయన ఇంట ఇప్పుడు విషాదం నెలకొంది. ఆదివారం రోజు ఆరవ్ తండ్రి నిదాన్ గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నైలో ఆయన మృతి చెందగా, అంత్యక్రియలని స్వస్థలం నాగర్ కోల్‌లో జరిపించనున్నారు.మోడల్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన ఆరవ్ తొలిసారి 2016లో వచ్చిన బేతాళుడుతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు.హౌజ్‌లో హీరోయిన్ ఓవియా ఓ సందర్భంలో అతనికి కిస్ ఇవ్వడంతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాడు ఓవియా, ఆరవ్ మధ్య కొన్నాళ్లు ప్రేమాయణం కూడా నడిచింది. కొన్నాళ్ల తర్వాత మనస్పర్ధలు రావడంతో ఓవియా ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే రేహితో అనే అమ్మాయిని పెళ్లాడిన ఆరవ్ ప్రస్తుతం ‘రాజా భీమ’, ‘మీందుమ్ ఆరగిల్ వా’ సినిమాల్లో నటిస్తున్నాడు.