హైదరాబాద్ : కొత్త సంవత్సరం వేడుకల దృష్ట్యా బార్లు, క్లబ్బులకు, మద్యం దుకాణాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటిగంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా డిసెంబర్ 31న రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఎస్‌డీ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు.