నోటిఫికేషన్ ఒక ఎన్నికల డ్రామా..:బండి సంజయ్
నిరుద్యోగుల కడుపుమంట లో కేసిఆర్ కాలిపోయే రోజులు వచ్చాయి. నోటిఫికేషన్ ఒక ఎన్నికల డ్రామా ,నిరుద్యోగుల ఓట్ల కోసమే పేపర్ ప్రకటన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఓట్లకోసం నోటిఫికేషన్ డ్రామా కు తెరలేపిండు. బీజేపీ ఆందోళనను ముందే పసిగట్టిన కేసిఆర్ భయపడి నోటిఫికేషన్ అని పేపర్ ప్రకటన చేశారు. నిజంగా నిరుద్యోగుల సమస్యల పై చిత్తశుద్ది ఉంటే అన్నీ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. నోటిఫికేషన్ తప్పుల తడకగా ఇచ్చి కోర్టుల ద్వారా నోటిఫికేషన్ రద్దు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తే నిరుద్యోగుల తడాఖా చూపిస్తాం జాగ్రత్తా. నోటిఫికేషన్ ఒక బూటకం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇదో కొత్త నాటకం. దుబ్బాక, జిహెచ్ఎంసి దెబ్బతో దొరకి 6 ఏళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తొచ్చారా..?
నిరుద్యోగుల కాళ్లుకడిగి నెత్తిన పోసుకున్నా నిన్ను క్షమించరు గుర్తుపెట్టుకో….!
మీ మాయల పకీరు మాటలు విని మోసపోయే రోజులకు కాలం చెల్లింది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక నిరుద్యోగులు గుర్తు రావడానికి 6 ఏళ్ల సమయం పట్టిందన్నమాట…!
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారుకు ఉన్న గీరలు ఊడిపొక తప్పదు. ఇన్నిరోజులు ఫాం హౌస్ లో పక్కేసుకొని పడుకున్న కేసిఆర్ కి దుబ్బాక, జిహెచ్ఎంసి దెబ్బతో సోయి వచ్చినట్టుంది. ముఖ్యమంత్రి మాటలను సీరియస్ గా తీసుకోవడం జనాలు ఎప్పుడో మానేశారు. కేసిఆర్ నోటిఫికేషన్ అనగానే సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం అన్నంత జోక్ గా నిరుద్యోగులు పరిగణిస్తున్నారు.