హైదరాబాద్,తీస్మార్ న్యూస్: సైబరాబాద్ పరిధిలో న్యూఇయర్ వేడుకలకు పోలీసులు బ్రేక్ వేశారు. న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. డిసెంబర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్, అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పోలీసులకు ప్రజలందరూ సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.
