అల్లాపూర్ డివిజన్ లోని శబ్దర్ నగర్ లో పర్యటన…

116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబియా గౌస్ ఉద్దీన్ గారు అల్లాపూర్ డివిజన్ లోని శబ్దర్ నగర్ పర్యటించారు శబ్దర్ నగర్ లోని ఆర్.ఆర్ హాస్పిటల్ దగ్గర 24 లక్షల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్డు పనులను పరిశీలించారు అలాగే‌ శబ్దర్ నగర్ లోని ఏ బ్లాక్ లో 80 లక్షల వ్యయంతో చేపడుతున్న సి సి రోడ్డు పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సహకారంతో నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని డివిజన్ పూర్తిస్థాయిలో అభివృద్ధి క్రమంలో తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు ఈ కార్యక్రమం అమీద్ తదితరులు పాల్గొన్నారు