హైదరాబాద్,తీస్మార్ న్యూస్: గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన శ్రీను అనే బీ.జే.పీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన మెడలో ఉన్న బీ.జే.పీ కండవాను లాగేసుకొని బండికి ఉన్న బీ.జే.పీ జెండాను తీసేసుకున్నారు.
*రోడ్డు ప్రమాదం లో మరణించిన బీజేపీ కార్యకర్త కు TRS నాయకుడి తక్షణ సహాయం తో బాటు కుటుంబానికి భరోసా*
సంపదలో లేకున్నా ఆపదలో వెన్నంటి నిలవడమే మనిషీ లక్షణం.
కానీ నమ్ముకున్నవాడే నట్టేట్లో ముంచేస్తే ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం.
*శేరిలింగంపల్లి డివిజన్* పరిదిలో జరిగిన విషాద సంఘటన నయవంచనకు సజీవ సాక్ష్యంలా నిలుస్తుంది. శ్రీను అనే బీజేపీ కార్యకర్త శేరిలింగంపల్లిలో బీజేపీ ప్రచారం ముగించుకొని వెల్తుంటే రోడ్డుపై యాక్సిడెంట్కు గురయ్యాడు. వెంటనే అక్కడున్న స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలిస్తుంటే అప్పటివరకూ అతనితో ప్రచారం చేయించుకున్న బీజేపీ నేతలు కనీసం సాయం చేయకపోగా, ఎక్కడ బీజేపీకి చెడ్డపేరు వస్తుందోనని అతని మెడలో అప్పటివరకూ ఉన్న తమ బిజెపి పార్టీ కండువాని లాక్కున్న అత్యంత దయనీయ ఘటన శేరిలింగంపల్లి డివిజన్లో జరిగింది.
ఇలా తమ సొంత పార్టీ కార్యకర్త రోడ్డుపై చనిపోతే అతని మెడలోంచి కండువా లాక్కోవడం అక్కడున్నవారి హ్రుదయాలను కలిచివేసింది.
తన గెలుపుకోసం ఇంట్లో పెళ్లాం పిల్లల్ని వదిలి రోడ్లపై తిరుగుతున్న సొంత పార్టీ కార్యకర్తల విషయంలోనే ఇంత నిస్సిగ్గుగా బీజేపీ వ్యవహరిస్తే రేపు ఓట్లేసి గెలిపించిన వారికి ఇంకెంత సున్నం పెడుతారోనని స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
శీను హస్పిటల్లో చనిపోయిన తర్వాత సైతం కనీస భాద్యతగా శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థిగానీ బీజేపీ నాయకత్వం కానీ అటువైపు చూడకపోవడం శోచనీయం.
విషయం తెలిసిన వెంటనే ప్రత్యర్థి అభ్యర్తైనా శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి రాగం నాగెందర్ యాదవ్ హుటాహుటిన కడుపేద పరిస్థితుల్లో ఉన్న శీను కుటుంబ సభ్యుల్ని ఇంటికి వెల్లి మరీ పరామర్శించాడు,
అంతేకాదు అత్యవసరంగా జరగవలసిన కార్యక్రమాలకోసం తను సొంతంగా పదివేల సహాయం చేశాడు. భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించాడు.
ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు చేయాల్సింది ఇది కదా…. తన పరిదిలో ప్రజలందరినీ సమాన ధ్రుష్టితో చూసే మంచిమనిషిగా రాగం నాగేందర్ యాదవ్ ఆ కుటుంబం ద్రుష్టిలో జీవితాంతం నిలిచిఉంటారు.
సొంత పార్టీ కార్యకర్తని పట్టించుకోని బీజేపీని స్థానికులు అసహ్యించుకుంటున్నారు.
బండిపై ముగ్గురు నలుగురు వెల్లమని చెప్పిన బీజేపీ అదినాయకత్వం ఇవ్వాల ఇలా రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయి తమ కుటుంబాల్ని అనాదలుగా వదిలేసిన శీను లాంటి వారికి ఏమార్గం చూపుతుంది.??