ప్రముఖ నటుడు ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పునీత్ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. పునీత్ రాజ్‌కుమార్ బాలనటుడిగా సుమారు 14 సినిమాల్లో నటించారు. 2002లో ‘అప్పు’ (తెలుగులో ‘ఇడియట్’)తో కథానాయకుడిగా మారారు. ఆ తర్వాత వరుస...
Author: Team Teesmaar News (Team Teesmaar News )
ఘనంగా దసరా ఉత్సవాలు
మహబూబాబాద్, తీస్మార్ న్యూస్: జిల్లాలోని కొల్లాపురం గ్రామంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిన్నింటి సుధాకర్, ఎంపీటీసీ గుర్రం కవిత వెంకన్న తో పాటుగా వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు
అగ్నికి ఆహుతైన బంగారు భవిష్యత్తు
పశ్చిమ గోదావరి,తీస్మార్ న్యూస్:జిల్లాలోని గురుభట్ల గూడెం గ్రామానికి చెందిన మహేష్ బాబు ఉన్నత చదువు కోసం పొలం అమ్మి 20 లక్షలు సిద్ధం చేసుకున్నాడు.భవిష్యత్తు కోసం కలలు కన్న మహేష్ బాబు కి పిడుగుపాటు రూపంలో కన్నీరు మిగిలింది.చదువు కోసం దాచుకున్న డబ్బు కళ్ళ ముందే ఆహుతవుతుంటే ఏమి చేయలేని నిస్సాహయక పరిస్థితి ఆ కుటుంబానికి కన్నీరు మిగిల్చింది.అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా కూడా వారు సరిగ్గా స్పందించలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వారు ఆ విద్యార్థి...
తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారయత్నం
క్రైం,తీస్మార్ న్యూస్:సైదాబాద్ ఘటన మరువకముందే హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెలితే మంగల్ హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం..చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.స్థానికులని చూసి సుమిత్ అనే నిందితుడు అక్కడ నుండి పరారైన్నట్టు తెలుస్తుంది.పరారీలో ఉన్న నిందుతుడిని అత్తాపూర్ వద్ద లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మృగాడు రాజు ఆత్మహత్య
క్రైం.తీస్మార్ న్యూస్:సైదాబాద్ అత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరు రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహన్ని గుర్తించారు.మృతుడి చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడు రాజు అని నిర్థారించారు.
తెలుగు రాష్ట్రాలకు వరుణ గండం
హైదరాబాద్:రానున్న మూడు రోజులు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.తెలంగాణలోని 16 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ,హైదరాబాద్ కి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి, జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి.అల్పపీడనంతో రెండు రాష్ట్రాల్లోను ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
కాంట్రాక్ట్ పశువైద్యుల ఏడాది పొడగింపుకి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన వెటర్నరీ డాక్టర్ లు
మంత్రి తలసానిని సన్మానించిన రాష్ట్ర కాంట్రాక్ట్ పశువైద్యుల సంఘము కాంటాక్ట్ పశు వైద్యుల కాలం మరో సంవత్సరం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడగించిన నేపథ్యంలో సర్కారుకి వెటర్నరీ డాక్టర్ల బృందం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి డాక్టర్ శ్రీధర్ నేతృత్వంలోని పశు వైద్యుల బృందం శుక్రవారం ప్రత్యేకంగా కలిసి థ్యాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా మంత్రిని శాలువా తో సన్మానించంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని పశు...
తెలంగాణలో మే 1 వరకు నైట్ కర్ఫ్యూ
హైదరాబాద్ : కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాష్ర్టంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. నిబంధనలు ఉల్లంఘించిన...
యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవదాన కార్యక్రమం
సత్తుపల్లి,తీస్మార్ న్యూస్:యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అవయవదాన అంగీకార కార్యక్రమం చేపట్టినట్టు సంస్థ ప్రతినిధి క్రాంతి తెలిపారు. అన్ని దానములలో అవయవ దానం గొప్పది అని మనం పెట్టే ఒక్క సంతకం వల్ల మున్ముందు కొన్ని కుటుంబాలని ఆదుకున్న వారిమి అవుతామని ఆసక్తి ఉన్న వారు ఈ కార్యక్రమంలో భాగమవ్వాలని ఆయన కోరారు.అవయవదానం చేయాలని అనుకునే వారు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వాలని విజ్ఞప్తి చేశారు....
చరిత్రలో ఈరోజు
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మంచుకొండను ఢీకొట్టి రెండు ముక్కలైన టైటానిక్ నౌక.. 1912 లో సరిగ్గా ఇదే రోజున మునిగిపోయింది. నౌకలోని దాదాపు 1500 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ నౌక బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నౌకాశ్రయం నుంచి న్యూయార్క్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. దీని కథను ఆధారంగా చేసుకుని 1997 లో టైటానిక్ అనే సినిమాను కూడా నిర్మించారు. ఈ సినిమాలో ఆరోజో జరిగిన ఘటనలను కండ్లకు కట్టినట్లు చూపించారు. టైటానిక్ 20...