ఆంధ్రప్రదేశ్‌లో మరో 310 కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 310 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణా, కర్నూల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 894044కు చేరింది. ప్రస్తుతం 2382 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 884471కు పెరిగింది. ఇవాళ్టి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7191కు చేరింది.