పవర్ స్టార్ కన్నుమూత

పవర్ స్టార్ కన్నుమూత

ప్రముఖ నటుడు ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పునీత్‌ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ బాలనటుడిగా సుమారు 14 సినిమాల్లో నటించారు. 2002లో ‘అప్పు’ (తెలుగులో ‘ఇడియట్’)తో కథానాయకుడిగా మారారు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు పునీత్‌. ‘వీర కన్నడిత’, ‘అరసు’, ‘మిలనా’, ‘వంశీ’, ‘రాజ్‌’, ‘జాకీ’, ‘హుడుగరు’, ‘అన్నా బాండ్‌’, ‘యారే కూగడాలి’, ‘పవర్‌’, ‘దొడ్డమానే హుడుగ’, ‘రాజకుమార’, ‘యువరత్న’ తదితర సినిమాలతో మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు పునీత్‌ రాజ్‌కుమార్‌. నటన మాత్రమే కాకుండా నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. డ్యాన్స్‌ ఆధారిత టీవీ కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. మరోవైపు క‌ర్ణాట‌క రాష్ట్రవ్యాప్తంగా హైఅల‌ర్ట్...

ఘనంగా దసరా ఉత్సవాలు

ఘనంగా దసరా ఉత్సవాలు

మహబూబాబాద్, తీస్మార్ న్యూస్: జిల్లాలోని కొల్లాపురం గ్రామంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిన్నింటి సుధాకర్, ఎంపీటీసీ గుర్రం కవిత వెంకన్న తో పాటుగా వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు

అగ్నికి ఆహుతైన బంగారు  భవిష్యత్తు

అగ్నికి ఆహుతైన బంగారు భవిష్యత్తు

పశ్చిమ గోదావరి,తీస్మార్ న్యూస్:జిల్లాలోని గురుభట్ల గూడెం గ్రామానికి చెందిన మహేష్ బాబు ఉన్నత చదువు కోసం పొలం అమ్మి 20 లక్షలు సిద్ధం చేసుకున్నాడు.భవిష్యత్తు కోసం కలలు కన్న మహేష్ బాబు కి పిడుగుపాటు రూపంలో కన్నీరు మిగిలింది.చదువు కోసం దాచుకున్న డబ్బు కళ్ళ ముందే ఆహుతవుతుంటే ఏమి చేయలేని నిస్సాహయక పరిస్థితి ఆ కుటుంబానికి కన్నీరు మిగిల్చింది.అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా కూడా వారు సరిగ్గా స్పందించలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వారు ఆ విద్యార్థి చదువుకు అండగా నిలిస్తే బాగుండు అని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు

తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారయత్నం

తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారయత్నం

క్రైం,తీస్మార్ న్యూస్:సైదాబాద్ ఘటన మరువకముందే హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెలితే మంగల్ హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం..చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.స్థానికులని చూసి సుమిత్ అనే నిందితుడు అక్కడ నుండి పరారైన్నట్టు తెలుస్తుంది.పరారీలో ఉన్న నిందుతుడిని అత్తాపూర్ వద్ద లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మృగాడు రాజు ఆత్మహత్య

మృగాడు రాజు ఆత్మహత్య

క్రైం.తీస్మార్ న్యూస్:సైదాబాద్ అత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరు రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహన్ని గుర్తించారు.మృతుడి చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడు రాజు అని నిర్థారించారు.

తెలుగు రాష్ట్రాలకు వరుణ గండం

తెలుగు రాష్ట్రాలకు వరుణ గండం

హైదరాబాద్:రానున్న మూడు రోజులు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.తెలంగాణలోని 16 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ,హైదరాబాద్ కి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి, జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి.అల్పపీడనంతో రెండు రాష్ట్రాల్లోను ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

ఓటీటీ లో ‘డియర్‌ మేఘ’ సినిమా

ఓటీటీ లో ‘డియర్‌ మేఘ’ సినిమా

‘కథ కంచికి మనం ఇంటికి’, ‘డియర్‌ మేఘ’ అంటున్నారు హీరో అదిత్‌ అరుణ్‌. ఈ కుర్ర హీరో నటిస్తున్న తాజా చిత్రాల టైటిల్స్‌ ఇవి. మంగళవారం అదిత్‌ అరుణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా డబుల్‌ ధమాకాలా ఈ రెండు చిత్రాల లుక్స్‌ని విడుదల చేశారు. ‘కథ కంచికి మనం ఇంటికి’లో అదిత్‌ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా నటించారు. నూతన దర్శకుడు చాణక్య చిన్న దర్శకత్వంలో మోనిష్‌ పత్తిపాటి నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘‘మా హీరో అదిత్‌ అరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మా చిత్రం మొదటి లుక్, మోషన్‌ పోస్టర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు మోనిష్‌ పత్తిపాటి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుభాష్‌ డేవాబత్తిన, లైన్‌ ప్రొడ్యూసర్‌: కుమార్‌ కోట, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: వైయస్‌ కృష్ణ. మేఘా ఆకాష్, అదిత్‌ అరుణ్, అర్జున్‌ సోమయాజుల ప్రధాన...

మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు

మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు

లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్‌ బయలుదేరుతుంది. సాయంత్రం 6 గంటలకల్లా డిపోలకు మెట్రో రైళ్లు చేరుకోనున్నాయి. కాగా, కరోనా రెండో వేవ్‌ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత లాక్‌డౌన్‌ గడువు నేటివరకు వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయం ఇచ్చింది.

అనుమానంతో వృద్ధుడి హత్య

అనుమానంతో వృద్ధుడి హత్య

మంత్రగాడనే అనుమానంతో ఓ గిరిజన వృద్ధుడిని హత్య చేసి గోదావరిలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, మంగళవారం పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం కే మారేడుబాకలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కే మారేడుబాక గ్రామానికి చెందిన కుంజా భీమయ్య(65) మే 12 నుంచి కనిపించడం లేదు. దీనిపై అతడి కుటుంబ సభ్యులు 13న దుమ్ముగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మారేడుబాక గ్రామానికి చెందిన తెల్లం శ్రీను, కుంజా లక్ష్మీనారాయణ, తెల్లం రాజారావు అలియాస్‌ రాజ్‌కుమార్, మిడియం శ్రీను అనే నలుగురు స్టేషన్‌కు వచ్చి నేరం ఒప్పుకున్నారు. భీమయ్య మంత్రాలు, చేతబడులు చేస్తుంటాడని.. తెల్లం శ్రీను భార్యకు నాలుక మీద పుండ్లు అయ్యాయని, లక్ష్మీనారాయణ పెద్ద కొడుకు రెండు నెలల క్రితం డెంగీ జ్వరంతో...

సోనూసూద్‌ సాయం

సోనూసూద్‌ సాయం

ఓ కరోనా బాధితుడికి ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ ప్రాణవాయువు అందించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లికి చెందిన రణబోతు వీరారెడ్డి(65) 25 రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా రూ.6 లక్షలు ఖర్చు అయింది. అయినా నిత్యం ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతుండటం, చేతిలో డబ్బు లేకపోవడంతో కుమారుడు సతీశ్‌రెడ్డి వారం క్రితం తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు. ఖమ్మం నుంచి నిత్యం ఆక్సిజన్‌ సిలిండర్‌ తెచ్చేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆన్‌లైన్‌ ద్వారా సోనూసూద్‌ ట్రస్ట్‌కు తెలియజేస్తూ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ కావాలని వేడుకోగా ఐదురోజుల్లోనే సుమారు రూ.60 వేల విలువైన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను మేడిదపల్లికి పంపించారు. తమ కష్టాలకు స్పందించి ఆక్సిజన్‌ కాన్సన్‌ ట్రేటర్‌ అందించిన సోనూసూద్‌కు సతీశ్‌ కృతజ్ఞతలు తెలిపాడు.